వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదమని మరోసారి నొక్కి చెప్పారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం.
చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉంది. తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయి. అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికాకు సేవ చేయాలనే నన్ను గెలిపించారు. అక్రమ వలస దారులను వెనక్కి పంపిస్తాం. ఎలాంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంది. విదేశీ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం.
ప్రపంచంలో అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్నాం. అమెరికా విద్యా వ్యవస్థలో పలు మార్పులు రావాలి. రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తాం. దేశ రక్షణా రంగాన్ని మెరుగు పరుస్తాం. ప్రతి ఒక్క సవాల్‌ని ధీటుగా ఎదురుకుంటాం. సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా ధళాల ఏకైక లక్ష్యం. ధరలను తగ్గించే చర్యలు తీసుకుంటాం. అంతరిక్ష ప్రయోగాలను విస్తృతం చేస్తాం. 2025 మనకు స్వేచ్ఛాయుత ఇయర్’ అని ట్రంప్ తెలిపారు.
The 60th Presidential Inauguration Ceremony https://t.co/kTB4w2VCdI
— Donald J. Trump (@realDonaldTrump) January 20, 2025
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.
అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగా 25వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.
ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.
వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులు మూసివేయడంతో పాటు మెట్రో సర్వీసులను మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment