
దుబాయ్: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు డిన్నర్లపై డిస్కౌంట్ ఇస్తామని దుబాయ్ రెస్టారెంట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకు యూఏఈలో 25 లక్షల మందికి టీకా వేశారు. దేశ మొత్తం జనాభా కోటి మంది. ప్రజల్లో టీకాపై మరింతగా అవగాహన పెంచేందుకు మేము సైతమంటూ రెస్టారెంట్లు ఇలా వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాయి. ‘ప్రేమను పంచు, దుఃఖాన్ని కాదు’ అంటూ గేట్స్ హాస్పిటాలిటీ గ్రూప్ తమ హోటళ్లపై బ్యానర్లు పెట్టింది.(చదవండి: వ్యాక్సిన్ కోసం టాటా, మోడరానా ఇంక్ జట్టు)
అదే విధంగా.. టీకా తొలి డోసు తీసుక్ను కస్టమర్లకు 10 శాతం, రెండు డోసులు తీసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. డిస్కౌంట్ కావాలనుకునే వాళ్లు టీకా తీసుకున్న ఆధారాలు చూపాలి. ఈ ఆఫర్‌ను ఎక్కువ మంది మెచ్చుకోగా, కొందరు మాత్రం పెదవి విరిచారు. ఇది ఒక మార్కెట్ స్టంట్ అని విమర్శించారు. దుబాయ్‌తో పాటు ఏడు ఎమిరేట్లు కలిసి యూఏఈగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో చైనా సినోఫామ్, వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment