
పారిస్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా కోలుకోలేని స్థితికిచేరుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో మరోసారి కోవిడ్-19 కలకలం రేపుతోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని ప్రధాని జీన్ క్యాస్టేక్స్ ప్రకటించారు. ప్రతిరోజు 25 వేలకు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రాజధాని పారిస్‌తో సహా అనేక నగరాలలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 4,168,394 మందికి వైరస్ సొకిందని, 91,324 మరణాలు నమోదయ్యాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సీటీ తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు 5.29 మిలియన్‌ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలందరికి అందించడం ద్వారా దీని వ్యాప్తిని నివారించవచ్చని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. బ్రిటన్, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే.. ఫ్రాన్స్, యూరోపియన్ దేశాలు వ్యాక్సిన్ పంపిణీలో వెనుకబడ్డాయని అన్నారు. ఈ దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీపై దీన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment