‘తెలుగు వారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు’ | On Ganesh Chaturthi US Presidential Nominee Joe Biden Wishes To All Indians | Sakshi
Sakshi News home page

మీ అడ్డంకులు తొలగాలని ఆకాంక్షిస్తున్న: జో బిడెన్‌

Published Sat, Aug 22 2020 9:14 PM | Last Updated on Sat, Aug 22 2020 9:23 PM

On Ganesh Chaturthi US Presidential Nominee Joe Biden Wishes To All Indians - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వినాయక చవితి సందర్భంగా అమెరికాలోని తెలుగు వారితో పాటు భారత ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా గణేష్‌ చతుర్థిని జరుపుకునే తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఆమెరికాలోని తెలుగు వారికి, భారత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గణేష్ చతుర్థి, హిందూ పండుగలను జరుపుకునే ప్రతి ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అన్ని అడ్డంకులను అధిగమించి, వివేకంతో, ఆశీర్వాదంలో కొత్త ఆరంభాల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్న’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అయితే ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు.   
(చదవండి: ఒబామా ట్వీట్‌ : తదుపరి అధ్యక్షుడు అతడే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement