‘ఇస్మాయిల్‌ హనియే హత్య.. ఇజ్రాయెల్‌ భారీ తప్పిదం’ | Iran says Israel Made Costly Strategic Mistake By assassinating Hamas Chief | Sakshi
Sakshi News home page

‘ఇస్మాయిల్‌ హనియే హత్య.. ఇజ్రాయెల్‌ భారీ తప్పిదం’

Published Thu, Aug 8 2024 9:10 PM | Last Updated on Fri, Aug 9 2024 10:40 AM

Iran says Israel Made Costly Strategic Mistake By assassinating Hamas Chief

హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియేను హత్య చేయటం ఇజ్రాయెల్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదమని ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘేరి అన్నారు. దాంతో ఇజ్రాయెల్‌  భారీ మూల్యం చెల్లించుకోనుందని తెలిపారు. ఆయన గురువారం ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక చేశారు. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ దాడి వ్యూహాత్మక తప్పిదం. ఈ దాడితో ఇజ్రాయెల్‌ భారీ మూల్యం చెల్లించుకోనుందని అన్నారు.  

జెడ్డాలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)సమావేశానికి హాజరైన తర్వాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చేయటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. హనీయే మరణంపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇరాన్ మాత్రం  హనియే మృతికి ఇజ్రాయెల్‌ కారణమని ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ భారీ మూల్యం చెల్లించుకోనుందని,  భవిష్యత్తులో ప్రతికార  దాడులు కూడా చేయనున్నామని  ఇరాన్‌ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్  ఉద్దేశపూర్వకంగా ఇతర దేశాలకు ఉద్రిక్తత, యుద్ధం, సంఘర్షణను విస్తరించాలని కోరుకుంటోందని మండిపడ్డారు.

అయితే ఇజ్రాయెల్‌ ఇరాన్‌తో పోరాడే స్థితిలో లేదన్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ సైన్యానికి సామర్థ్యం, శక్తి లేదని ఆరోపించారు. బుధవారం జెడ్డాలో జరిగిన 57 మంది సభ్యులతో కూడిన ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇస్మాయిల్‌ హనియే హత్యకు కారణం ఇజ్రాయెల్‌ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement