అద్భుత దృశ్యం.. సముద్రంపై రెక్కలు విచ్చుకున్న ‘పడవలు’ | Italy Barcolana week Is A Largest Sailing Regatta In The World | Sakshi
Sakshi News home page

బార్కొలానా వీక్‌.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం

Published Mon, Oct 10 2022 8:58 AM | Last Updated on Mon, Oct 10 2022 9:41 AM

Italy Barcolana week Is A Largest Sailing Regatta In The World - Sakshi

రోమ్‌: సముద్రంపై రెక్కలు విప్పుకుని వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అయితే, ఇవి పక్షలు కాదు.. తెరచాప పడవలు. ఆదివారం ఇటలీలోని ట్రీస్టెలో ఏడ్రియాటిక్‌ సముద్ర తీరం వెంట జరుగుతున్న 54వ బార్కొలానా పడవపందెంలో భాగంగా ఈ అద్భుతం దృశ్యం ఆవిషృతమైంది. 2022, అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బార్కొలానా వీక్‌ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పడవ పోటీగా ఇది 2018లోనే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఈ పడవల పందెం. 

ప్రస్తుతం వారం రోజుల పాటు అట్టహాసంగా సాగిన ఈ తెరచాప పడవల పరుగు పందెం 54వ ఎడిషన్‌. ఇందులో 2,689 పడవలు పాలుపంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా ట్రీస్టే గల్ఫ్‌ ప్రాంతంలో అక్టోబర్‌ రెండో ఆదివారం నిర్వహిస్తారు. పడవల ఆకృతిని బట్టి విభజించి పోటీలు చేపడతారు. తొలిసారి 1969లో ఈ తెరచాప పడల పోటీలు నిర్వహించగా అందులో 51 బోట్లు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెయిలర్స్‌ ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు.


ఇదీ చదవండి: అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement