Italy's Former Prime Minister Silvio Berlusconi Passed Away - Sakshi
Sakshi News home page

విషాదం: మాజీ ప్రధాని, వ్యాపారవేత్త బెర్లూస్కోనీ కన్నుమూత

Published Mon, Jun 12 2023 4:17 PM | Last Updated on Mon, Jun 12 2023 5:44 PM

Italy Former Prime Minister Silvio Berlusconi Passed Away - Sakshi

రోమ్‌: ఇటలీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త సిల్వియో బెర్లుస్కోనీ (86) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. మరోవైపు.. బెర్లూస్కోనీ మరణంతో ఇటలీలో రాజకీయ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివరాల ప్రకారం.. బెర్లూస్కోనీకి కొన్నేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధి సోకింది. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్‌ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కొన్ని రోజుల కిత్రమే ఆయనకు ఊపిరితిత్తులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకింది. ఈ క్రమంలో వ్యాధుల కారణంగా నొప్పి, బాధను ఆయన తట్టుకోలేకపోయారు. దీంతో​, వ్యాధులతో పోరాడుతూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.

ఇదిలా ఉండగా, బెర్లుస్కోనీ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఇటలీ చరిత్రలోనే అతిపెద్దదైన మీడియా సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఫోర్జా ఇటాలియా అనే పార్టీని స్థాపించి దేశ ప్రధాని అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉన్నది. అయితే ప్రభుత్వంలోనే బెర్లుస్కోనీ ఎలాంటి పదవిలో లేరు. ఇక, పన్ను ఎగవేత మోసాలకు పాల్పడినందుకు గాను ఆయనపై ఆరేళ్ల పాటు రాజకీయాల నుంచి నిషేధం విధించబడింది.  

ఇది కూడా చదవండి: ‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’.. వాళ్లను నవ్వించేందుకు రెస్క్యూ టీం ఏం చేసిందంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement