టోక్యో: పండ్లు,కూరగాయలు కొనుగోలు చేయాలంటే మహా అయితే వందల్లో ఖర్చు అవుతుంది. పండ్లకు అన్‌సీజన్‌లో మాత్రమే ధర అధికంగా ఉంటుంది. అదీ కూడా కొనలేని స్థితిలో ఏం ఉండదు. జపాన్‌లో మాత్రం అలా కాదు.. యుబారి అనే పుచ్చకాయ కొనుకోలు చేయాలంటే లక్షలు ఖర్చుచేయాల్సిందే! అందుకే ప్రపంచలోనే అత్యంత ఖరీదైన పండుగా గుర్తింపు పొందింది. ఈ పండును కొనుగోలు చేసే డబ్బులో తక్కువలో తక్కువ మన దగ్గర ఎకరా భూమిని కూడా కోనుగోలు చేయవచ్చు.
చదవండి: అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్
కేజీ యుబారి పుచ్చకాయ ధర లక్షల్లో ఉంటుంది. ధనవంతులు తప్ప సామాన్యులకు అందనంత ఖరీంది. యుబారీ పండు ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. అందుకే కొనుగోలుదారులు, రెస్టారెంట్ యజమానులకు సౌలభ్యం కోసం ఈ పండును చిన్న చిన్న పరిమాణాల్లో అమ్ముతుంటారు. జపాన్‌లోని యుబారి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరుగుతుంది. గ్రీన్‌హౌస్ లోపల సూర్యకాంతిలో ఈ పండును పెంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment