సాక్షి, న్యూఢిల్లీ : ఆమెకు పట్టుమని 17 ఏళ్లు ఉంటాయి. ఏం తొందరొచ్చిందో, ఏమోగానీ చకా చకా పెరగిపోయింది. ఇంకా పెరగుతూనే ఉంది. అప్పుడే ప్రపంచంలోనే అతి పొడువుకాళ్ల అమ్మాయిగా అందలం ఎక్కేసింది. నాలుగు అడుగుల ఐదు అంగుళాల కాళ్లను కలిగి ఆరు అడుగుల పది అంగుళాల ఎత్తుకు ఎదిగి ప్రపంచం దష్టిలో పడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో తన తల్లి త్రిష్‌తో కలిసి ఉంటున్న ఆ 17 ఏళ్ల అమ్మాయి పేరు మ్యాక్ కురియన్. మంచి మోడల్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతున్న కురియన్‌ను రోజువారి కష్టాలు ఎన్నో ఎన్నెన్నో!
తన సైజుకు తగ్గట్లు బట్టలు దొరకవు, చెప్పులు, బూట్లు అసలే దొరకవు. వాటన్నింటిని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సిందే. ఏ గుమ్మంలో నుంచైనా వంగి పోవాల్సిందే. కార్లలో వంగి కూడా పోలేదు. స్లీపింగ్ మోడ్‌లో పోవాల్సిందే. ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తున్న తల్లి త్రిష్, ఆరు అడుగులు ఎత్తున్న తండ్రి కామెరాన్‌ను తాను పుట్టడమే తన అంత పొడువుకు కారణం కావచ్చని ఆమె అంటున్నారు. ఆమె సోదరుడు జాకబ్ ఆరడుల మూడు అంగుళాల ఎత్తుతోనే సరిపెట్టుకున్నారట.
అందరి శిశువుల్లాగే 19 అంగుళాల పొడువుతో జన్మించిన కురియన్ తొమ్మిదేళ్లకే ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుకు పెరిగారట. అతి పొడవైన కాళ్లు కలిగిన యువతిగా రికార్డు కొట్టిన కురియన్, ప్రపంచంలోనే అతి ఎల్తైన సజీవ మహిళగా రికార్డు కొట్టాలంటే ఆమె మరి కొన్ని అంగుళాలు పెరగాల్సిందే. చైనాకు చెందిన 33 ఏళ్ల సన్ ఫాంగ్ ఏడు అడుగుల మూడు అంగుళాలతో ప్రపంచ పొడవైన మహిళగా రికార్డు అందుకున్నారు. ఎనిమిది అడుగుల ఒక అంగుళంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జెంగ్ జిన్‌లియాన్ 1980లో మరణించారు. ఆమె కూడా చైనాకు చెందిన వారే.
వామ్మో ! పొడవంటే పొడువు కాదు..
Published Tue, Oct 6 2020 5:48 PM | Last Updated on Tue, Oct 6 2020 7:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment