కౌలాలంపూర్: మలేషియా దేశ ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ రేపు(సోమవారం) రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ముహిద్దీన్ ప్రధాని పదవికి రాజీనామా చేయన్నుట్లు ఆ దేశ అధికార పోర్టల్ ఆదివారం వెల్లడించింది. బల నిరూపణలో భాగంగా మలేషియా ప్రధాని మెజారిటీ కోల్పోయారు.
అయితే సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో ముహిద్దీన్ మెజారిటీ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆర్దిక మాంద్యం, కరోనా కేసులతో మలేషియాలో మరింత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. మలేషియా ప్రధానిగా ముహిద్దీన్ 17 నెలల పాటు సేవలందించారు. ఇక తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయింస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment