వాషింగ్టన్ : ఖగోళానికి సంబంధించి మరో అరుదైన సమచారాన్ని నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా) సేకరించింది. సూర్యకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం యొక్క ఉపగ్రహం ఫోటోలను తీయగలిగింది. ఈ పని కోసం అత్యంతంత శక్తివంతమైన కెమెరాలను ఉపయోగించింది నాసా.
జెనీమీడ్
సూర్య కుటుంబంలో పెద్దదైన గురు గ్రహానికి మొత్తం 79 ఉపగ్రహాలు ఉండగా ఇందులో 53 గ్రహాలను ఇప్పటి వరకు గుర్తించారు. వీటిలో అన్నింటికంటే జెనీమీడ్ పెద్దది. మొత్తం సౌరకుటుంబంలోనే ఉపగ్రహాల్లో జేనిమీడ్ పెద్దదిగా గుర్తింపు పొందింది. అయితే నాసా చేపట్టిన జూనోమిషన్‌లో భాగంగా తొలిసారిగా జెనీమీడ్‌కి సంబంధించిన చిత్రాలు భూమికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని నాసా స్వయంగా ప్రకటించింది.
జూన్ 7న
జూన్ 7న జూనో స్పేస్‌క్రాఫ్ట్ జేనీమీడ్‌కి దగ్గరగా వెళ్లింది. ఆ సమయంలో జెనీమీడ్‌కి సంబంధించిన చిత్రాలను షూట్ చేసింది.ఇందులో రెండు చిత్రాలను నాసా విడుదల చేసింది. జెనీమీడ్ ఉపరితం, ఎత్తు వంపులు ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లలో రెండు సార్లు మాత్రమే జెనీమీడ్‌కి సమీపంలోకి జూనో స్పేస్‌క్రాఫ్ట్ వెళ్ల గలిగింది.
Hello, old friend. Yesterday our #JunoMission made the first close flyby of Jupiter’s giant moon Ganymede in more than 20 years, and the first two images have been received on Earth. 📸 More to come. See details at: https://t.co/zIVMO6waKH pic.twitter.com/2RiW3iSmIp
— NASA Solar System (@NASASolarSystem) June 8, 2021
చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి!
Comments
Please login to add a commentAdd a comment