వాషింగ్టన్: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో నేపాల్‌కు చెందిన మునా పాండే మృతిచెందింది. ఈ క్రమంలో కాల్పులు జరిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు అమెరికా పోలీసులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. అమెరికాలోని హ్యుస్టన్‌లో భారత సంతతి వ్యక్తి బాబీ సిన్ షా(25) నేపాల్‌కు చెందిన యువతి మునా పాండే(21)పై కాల్పులు జరిపాడు. అయితే, బాబీ.. ఆమె ప్లాట్‌లో దొంగతనం చేసేందుకు వెళ్లిన క్రమంలో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి తాజాగా బాబీ సిన్ షా ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, మునా పాండే అమెరికాలో కమ్యూనిటీ కాలేజీలో చదువుతోంది.
51 year old Man arrested, charged after 21-year-old Nepali student found shot to death inside her NW Houston apartment 🇺🇸
Bobby Singh Shah allegedly shot and killed 21-year-old Muna Pandey during an aggravated robbery over the weekend. Her body was discovered with multiple… pic.twitter.com/UzRS1Ddlx2— CarraDeShaukeen (@CarraDeShaukeen) August 30, 2024
ఇదిలా ఉండగా.. మునా పాండే మృతి కారణంగా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ.. మునా పాండే నాకు ఒక్కగానొక్క కూతురు. ప్రతీరోజు నాతో ఫోన్‌లో మాట్లాడేది. ఒక్కసారిగా ఫోన్ రాకపోవడంతో కంగారుపడ్డాను. ఆమె స్నేహితులకు ఫోన్ చేయడంతో చనిపోయినట్టు చెప్పారు. నేను ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయాను. అసలు ఏం జరిగిందో తెలియదు. దయచేసి మా కూతరు మృతదేహాన్ని మాకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, మునా పాండే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు నేపాల్ కాన్సులేట్ ప్రయత్నాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment