![One Lost Life And Three Injured In Shooting California USA - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/6/police_0.jpg.webp?itok=Jlg7DBzJ)
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. సోమవారం ఉదయం సాంటారోసా ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తి సాంటారోసా ప్రాంతానికి చెందినవాడు కాగా.. గాయపడిన మిగతా ముగ్గురిలో 17 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాలుడితో పాటు మరో మహిళ కూడా ఉంది. కాగా వీరంతా సాంటారోసా ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. కాగా కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment