న్యూయార్క్: తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఒక్కో తుపాకీకి 500 డాలర్ల విలువైన గిఫ్ట్ కార్డు ఇస్తామని ప్రకటించి, అందుకు గాను 9 కేంద్రాలను శనివారం ఏర్పాటు చేసింది. వీటికి పౌరుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
వివిధ రకాల అసాల్ట్ రైఫిళ్లు, ఘోస్ట్ గన్స్ కలిపి 3 వేలకు పైగా తుపాకులను పౌరులు అప్పగించినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు. మొదటి ఆయుధానికి 500 డాలర్లు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల చొప్పున అందజేశామన్నారు. బ్రూక్లిన్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మూడు గంటల్లోనే 90 గన్లను సరెండర్ చేయగా, సిరాక్యుజ్‌లో అత్యధికంగా 751 ఆయుధాలను అప్పగించారన్నారు. తమ వద్దకు చేరిన ప్రతి ఆయుధంతో ఒక జీవితాన్ని కాపాడినట్లే, ఒక ప్రమాదకర కాల్పుల ఘటనను నివారించినట్లేనన్నారు.
ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. ఇదేం పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment