వీడియో దృశ్యాలు
లండన్ : బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తూ గత బుధవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నింబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ సారి హెచ్చరించటం.. వినకపోతే ఫైన్ వేయటం.. అప్పటికీ వినకపోతే అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ( యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం )
శనివారం సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ వ్యక్తికి 200 స్టెర్లింగ్ పౌండ్ల ఫైన్ వేశారు. ప్రీతీ పాటెల్ అనే మహిళను హెచ్చరించి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment