ప్రధానమంత్రి నరేంద్రమదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మోదీ చేపట్టించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గొప్పదని కొనియాడారు. ఈ విధానాల అమలుకు ప్రధాని మోదీ చూపిస్తోన్న చొరవను మెచ్చుకున్నారు. దీనివల్ల దేశంలోని పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రష్యాలోనూ దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంలో భారత్ విజయాలను అనుసరిస్తామని పేర్కొన్నారు
ఈ మేరకు వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో పుతిన్ మాట్లాడుతూ..‘ఒకప్పుడు మన దగ్గర దేశంలో తయారు చేసిన కార్లు లేవు. కానీ ప్రస్తుతం మనం కార్లను తయారు చేసుకుంటున్నాం. అయితే అవి 1990లో భారీ మొత్తంలో మేము కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడికార్ల కంటే సాదాసీదాగా కనిపిస్తున్నాయి. కానీ ఇది సమస్య కాదు. స్వదేశీ తయారీ విషయంలో మనం మన భాగస్వాములు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలి’ అంటూ రష్యాలో తయారైన కార్ల గురించి ఎదురైన ఓ ప్రశ్నకు పుతిన్ సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ స్వదేశీ తయారీ,వినియోగంపై దృష్టి సారించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన విధంగా ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' (IMEC) రష్యాను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పుతిన్ అన్నారు. నిజానికి అది తమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా ఇటీవల భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కారిడార్ ప్రణాళికలను మోదీ ఆవిష్కరించారు.
చదవండి: ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
Comments
Please login to add a commentAdd a comment