Russia’s Luna-25 Crashes on the Moon, Moscow Declares Mission Failed - Sakshi
Sakshi News home page

చంద్రుడిపై అడుగు పెట్టకుండానే కుప్పకూలిన రష్యా ల్యాండర్‌

Published Sun, Aug 20 2023 3:21 PM | Last Updated on Sun, Aug 20 2023 8:01 PM

Russia Moon Mission Luna 25 Failed  - Sakshi

మాస్కో: రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. లూనా-25 సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది.  

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా -25లో శనివారం సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడిపై కుప్పకూలింది. చంద్రుడికి సమీపంగా వెళ్లిన తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ నెల 21న ఇది చంద్రుడిపై కాలు మోపాల్సి ఉండగా అంతలోనే ఇలా జరగడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రష్యా శాస్త్రవేత్తలు.   

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని  ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు చేసిన ఈ ప్రయోగంపై రష్యా మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ చివరి నిముషంలో క్రాష్ ల్యాడింగ్ జరగడం దురదృష్టకరమంటోంది రోస్ కాస్మోస్. 

మరోపక్క భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రయాన్-3 అన్ని దశలను పూర్తి చేసుకుని చంద్రుడికి అత్యంత సమీపంలో పరిభ్రమిస్తుంది. నిర్దేశిత సమయంలోనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపుతుందని శనివారం ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.   

ఇది కూడా చదవండి: దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement