కీవ్ నుంచి సాక్షి ప్రతినిధి: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంలో రష్యా సైన్యం కల్లోలమే సృష్టిస్తోంది. రష్యా బలగాలు ప్రస్తుతం కీవ్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మోహరించి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నగరంపైకి వచ్చిపడతాయని వార్తలు వస్తున్నాయి. కవరేజీలో భాగంగా కీవ్‌లో ఉన్న ‘సాక్షి’ ప్రతినిధికి అడుగడుగునా యుద్ధ బీభత్సాన్ని కళ్లకు కట్టే హృదయ విదారక దృశ్యాలే కన్పించాయి.
నగరంలోని 33 లక్షల జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికే వలసబాట పట్టినట్టు చెబుతున్నారు. నగరంపైకి నిత్యం బాంబులు, క్షిపణులు దూసుకొస్తూనే ఉన్నాయి. ఆవాస ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకుని విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి. నగర నడిమధ్యలో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్ రెట్రోవిల్లా భవనం దాడిలో నేలమట్టమైంది. కీవ్‌ను వీలైనంత త్వరగా ఆక్రమించి తన అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రష్యా లక్ష్యంగా కన్పిస్తోంది.
కీవ్‌ను ఇప్పటికే అన్నివైపుల నుంచీ సైన్యం చుట్టుముట్టిందని స్థానిక ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా నగరంపై అది విరుచుకుపడుతుందని ఆందోళన చెందుతున్నారు. నగరంపై రష్యా దాడిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంంది. హైవేలు, ఇతర రోడ్లపై ప్రతి 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఒకటి చొప్పున బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment