మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో లక్ష మందికిపైగా సైనికుల్ని కోల్పోయిన రష్యా ఇక వీధి కుక్కలను కదనరంగంలోకి దించనుందా? వాటిని ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌లో విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? రష్యా కమ్యూనిస్ట్ పార్టీ డిప్యూటీ చీఫ్ విక్టోర్ మకరోవ్ ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే అదే జరిగేలా కని్పస్తోంది.
‘‘జంతువులను, ముఖ్యంగా వీధి కుక్కలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను ఎక్కడిక్కడ పేల్చేయాలి. అప్పుడు మనకు సైనిక నష్టం తగ్గడమే గాక రష్యాలో వీధి కుక్కుల సమస్య కూడా తీరిపోతుంది’’ అంటూ ఆయన విచిత్ర ప్రతిపాదన చేశారు. అయితే ఇంతకన్నా చెత్త ఐడియా మరొకటి ఉండదంటూ సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు..
రెండో ప్రపంచ యుద్ధ వేళ సోవియట్ యూనియన్ ఇలాగే ఆర్మీ జాగిలాల ద్వారా కనీసం 300కు పైగా జర్మనీ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది! కానీ బాంబులను యుద్ధ ట్యాంకులపైకి విసిరేలా కుక్కలకు శిక్షణ శ్రమతో కూడిందే! ఇక కుక్కలను యుద్ధభూమికి పంపడమంటే రష్యా ఓటమిని ఒప్పుకున్నట్టేనంటూ అమెరికా తదితర దేశాలు ఎద్దేవా చేస్తున్నాయి. రష్యా సైనిక శక్తి నిండుకుంటోంది గనుకే ఇలాంటి ఆలోచనలు చేస్తోందంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నాయి!!
Comments
Please login to add a commentAdd a comment