మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా కోటీశ్వరుడు ఒలెగ్ టింకావ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పిచ్చి యుద్ధాన్ని వెంటనే ఆపాలన్నారు. ‘‘రష్యా సేనలు చెత్తవి. దేశంలో 90 శాతం మంది యుద్ధాన్ని సమర్థించడం లేదు’’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన రష్యన్లలో టింకావ్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే, తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు.
చదవండి: (తస్మాత్ జాగ్రత్త!)
Comments
Please login to add a commentAdd a comment