Serious Comments
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
చిన్న బిడ్డను కూడా వదలరా.. ఛీ మీ బతుకులు చెడ
-
రైతులపై చిత్తశుద్ధి ఇదేనా చంద్రబాబు: వైఎస్ జగన్
-
Big Question: మేమే కార్య కర్తలం.. మేమే సేవకులం.. పోలీసులు లేకపోతే భయపడతారనుకున్నారు కానీ
-
చంద్రబాబు, లోకేష్ ని ఏకిపారేసిన పోతిన మహేష్
-
పవన్ కళ్యాణ్ స్పందించాలి.. కిరణ్ రాయల్ పై మండిపడ్డ మహిళలు
-
ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడే, సంపద సృష్టి జరిగింది ఆయన జేబులోనే... నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
ప్రచారం పీక్స్.. తొక్కిసలాట ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
బాబు ఆరు నెలల పాలన అంతా దోచుకోవటం.. దాచుకోవటం
-
మీడియాపై టీడీపీ మూకల దాడి
-
చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి.. కూటమికి హెచ్చరిక
-
పవన్ పై ఆర్కే రోజా ఫైర్
-
పెన్షన్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు...
-
కాంగ్రెస్ పాలనలో పత్తి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
-
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
లడ్డు వివాదం.. రేపు సుప్రీం కోర్టులో జరిగేది ఇదే
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సీరియస్
-
బాబు 100 రోజుల పాలనపై అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఫైర్
-
తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
-
చంద్రబాబును గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కించాలి.. బాబుపై సెటైర్లు
-
కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం ఉద్రిక్తలకు దారి తీస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) రాష్ట్ర డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు.అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని సీఎం ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13)మధ్యాహ్నం శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రివ్యూ చేయనున్నారు.శాంతిభద్రతలు చెడగొట్టేవారిని వదిలేది లేదు: డీజీపీ జితేందర్కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డీజీపీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి.హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుంది. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని సూచించారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
వచ్చే ఎన్నికల్లో మీకు సింగల్ డిజిట్ కూడా రాదు
-
చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!
-
విరాళాలు ప్రజలవి.. ఫోటో నీదా.. బాబును ఏకిపారేసిన కాకాణి
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండొద్దు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
బాబు, పవన్ పై పుష్ప శ్రీవాణి ఫైర్
-
మంత్రి సవితమ్మ అండతో రెచ్చిపోతున్న కలప దొంగలు..
-
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
ఎంతో కష్టపడి కట్టుకున్న ఆఫీస్ కూల్చేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రబాబు..
-
ఈనాడు పేపర్ పై రెచ్చిపోయిన బొత్స
-
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
-
పవన్ కళ్యాణ్ ని వదిలి 1000 మంది వైఎస్ఆర్ సీపీలోకి జనసేన నాయకులు
-
చంద్రబాబు నిప్పు-పప్పు అన్నాడు..371 కోట్లు దొబ్బేసి ఏం చేశాడంటే..
-
యువతని మోసం చేసి 240 కోట్లు దొబ్బేసావు..బాబుపై వెల్లంపల్లి ఫైర్
-
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం, దరిద్రం
-
పవన్, చంద్రబాబుపై మంత్రి అంబటి సీరియస్ కామెంట్స్
-
1969 తెలంగాణ ఉద్యమం లో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది
-
పవన్ చిత్రపటాన్ని చెప్పుతో కొట్టిన మహిళలు
-
పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ సీరియస్
-
కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీనా?
సాక్షి, అమరావతి: అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం నామోషీగా ఎందుకు భావిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సింగిల్ జడ్జిలు ఆదేశాలు జారీ చేయగానే, వాటిని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసే ధోరణి పెరిగిపోయిందని ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీరు సరైనది కాదంది. వ్యక్తిగత హాజరు శిక్షేమీ కాదని, జడ్జేమీ ఉరి తియ్యరని, ఆ అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. ఫలానా అధికారి కోర్టు ముందు హాజరయ్యారని పత్రికల్లో రావడం పరువు తక్కువగా భావిస్తున్నందునే అప్పీళ్లు దాఖలు చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడమేగాక, ఉత్తర్వుల కాపీని తీసుకునేందుకు నిరాకరిస్తూ కోర్టునుద్దేశించి కింది స్థాయి అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) సీఎండీ, చీమకుర్తి సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), మరికొందరు అధికారులను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. సింగిల్ జడ్జి ముందు హాజరై, అన్నీ అక్కడే చెప్పుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ విద్యుత్ బిల్లులు బకాయి పడటంతో సీపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నందున విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని దీనిని విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యం ఈ నెల 3న మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని, అంతేగాక కోర్టు ఆదేశాల కాపీని కూడా తీసుకోలేదని, పైపెచ్చు కోర్టునుద్దేశించి అనుచిత వ్యా ఖ్యలు చేశారని గణపతి గ్రానైట్స్ న్యాయవాది తెలిపారు. ఆ వ్యాఖ్యల సీడీని న్యాయమూర్తి ముందుంచారు. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు భావిస్తున్నప్పటికీ, వారి వాదన కూడా వినడం సమంజసమని, ఈ నెల 6న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అధికారుల తరపున వీఆర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గణపతి గ్రానైట్స్ సంస్థ రూ.48 లక్షల వరకు బిల్లులు బకాయి పడినందునే విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు గడువు ఉందన్నారు. వాదనలు విన్న ధ ర్మాసనం.. కోర్టు పట్ల అధికారుల సంభాషణను దృష్టిలో పెట్టుకుని వారి తీరును ఆక్షేపించింది. -
కేసీఆర్.. టైమ్‌పాస్ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్
-
ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడేతత్వం ప్రదర్శిస్తున్నారు:మంత్రి మేరుగ
-
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కుబేరుడు తీవ్ర వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా కోటీశ్వరుడు ఒలెగ్ టింకావ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పిచ్చి యుద్ధాన్ని వెంటనే ఆపాలన్నారు. ‘‘రష్యా సేనలు చెత్తవి. దేశంలో 90 శాతం మంది యుద్ధాన్ని సమర్థించడం లేదు’’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన రష్యన్లలో టింకావ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. చదవండి: (తస్మాత్ జాగ్రత్త!) -
చంద్రబాబే కేంద్రానికి తాకట్టుపెట్టారు
-
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్‌పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. -
చేయకూడనివన్నీ చేసింది..
ముంబై/హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు. కార్వీ మాత్రం ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు’ అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు. ఎన్ఎస్ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు.. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీకి చెందిన కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నా యా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ. 600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది. అంతా సర్దుకుంటుంది కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
సిగ్గుతో చావండి
అకోలా/జల్నా: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో పదును పెంచారు. కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దుని మోదీ, షాలు ప్రచార ఎత్తుగడగా మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో విపక్షాల నోరు మూయించే క్రమంలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అకోలా, జల్నా జిల్లాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘కశ్మీర్‌కు, మహారాష్ట్రకి ఏమిటి సంబంధమని ఎలా అంటారు ? వారికెంత ధైర్యం ? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్లకు సిగ్గు అనిపించడం లేదా ? డూబ్ మరో డూబ్ మరో (సిగ్గుతో చావండి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరివార్ భక్తినే (ఒక కుటుంబానికి విధేయత చూపించడం) రాష్ట్ర భక్తిగా (జాతీయభావం) భావిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పొత్తుపైన కూడా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలది అవినీతి పొత్తు అని నిందించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో సామాన్య ప్రజలకే నష్టం జరిగిందని అన్నారు. -
మేజర్ని.. విడాకులు మంజూరు చేయండి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సమాజం ఒప్పుకోదు విడాకులు కావాలన్న పవిత్రకు న్యాయమూర్తుల హితవు చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భార్యాభర్తల బంధం ఎంతో బాధ్యతతో కూడుకున్నది. మేజర్ అయినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వ్యవహరించి సమస్యలు సృష్టించే హక్కులేదు, న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు’. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు తమిళ్‌వాసన్, సెల్వం. న్యాయమూర్తుల నోటి వెంట ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు రావడానికి గల కారణాల్లోకి వెళితే... తమిళనాడు వేలూరు జిల్లా పల్లికొండ కుచ్చిపాళయానికి చెందిన పళని భార్య పవిత్ర అకస్మాత్తుగా అదృశ్యమైంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆంబూరుకు చెందిన షమీల్‌అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో షమీల్‌అహ్మద్ లాకప్‌డెత్‌కు గురయ్యాడు. ఆంబూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ఒక వర్గం పోరాటానికి దిగింది. పల్లికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ మార్టిన్ ప్రేమ్‌రాజ్ సమా ఏడుగురు పోలీసులు సస్పెండ్‌కు గురయ్యారు. విచారణలో షమీల్‌అహ్మద్‌తో పవిత్రకు సన్నిహత సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పవిత్ర ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తన భార్య పవిత్ర ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ పోలీసు ఫిర్యాదుతోపాటు మద్రాసు హైకోర్టులో భర్త పళని పిటిషన్ దాఖలు చేశాడు. పవిత్ర ఆచూకీ కోసం ఏర్పాటైన రెండు పోలీసు బృందాలు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నైలో దాక్కుని ఉన్నట్లు కనుగొని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం మద్రాసు హైకోర్టులో ప్రవేశపెట్టగా ‘నా భర్త పళనితో కాపురం చేయడం ఇష్టం లేదు, నా వయస్సు 25 ఏళ్లు, మేజర్ కాబట్టి విడాకులు మంజూరు చేయండి’ అంటూ పవిత్ర న్యాయమూర్తులను కోరింది. ఇందుకు న్యాయమూర్తులు బదులిస్తూ, ‘మేజర్‌వు కాబట్టి నీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కుంది, అయితే సభ్య సమాజం భార్యాభర్తలు కలిసి ఉండాలని చెబుతోంది. మీకు పిల్లలు ఉన్నారు, వారి బాగోగుల దృష్ట్యా కలిసి కాపురం చేయాలి. భర్తను వదిలి వెళ్లిపోయిన కారణంగా చేపట్టిన విచారణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆం బూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మీ వల్ల సమాజంలో కలవరం ఏర్పడింది. ఈ కలవరాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలను అనుమతించరాదు. విడాకులు కావాలంటే అందుకు వేరే కోర్టు ఉంది. మేము మంజూరు చేయలేము. కావాలనగానే పొందేందుకు విడాకులు అంగడిలో దొరికే వస్తువు కాదు. పవిత్ర తల్లిదండ్రులను కోర్టుకు పిలిపించి కుమార్తెకు బుద్దిచెప్పండి అంటూ ఆదేశించారు.