వాషింగ్టన్: ఇది స్మార్ట్‌యుగం.. స్మార్ట్ ఫోన్‌లు, వాచ్‌లు, లాపీలు మనుషులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మనిషి జీవింతంలో ఒక భాగమైపోయాయి. అయితే, ఇవి కొందరికి వరంగా మారితే, మరికొంత మందికి ఇబ్బందికరంగా కూడా తయారయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నాదియా ఎసెక్స్ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్‌కు స్మార్ట్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వాచ్‌లో ప్రధానంగా.. సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, ఫిట్‌నెస్ అలెర్ట్, రిమైండర్స్, ఫిట్‌బిట్ రీడింగ్..ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే , ఆ స్మార్ట్ వాచ్ అలెర్ట్ నోటిఫికేషన్‌ను ఆ యువతి తన స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంది.
ఈ క్రమంలో, ఒకరోజు బాయ్‌ఫ్రెండ్‌కు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 500ల కేలరీల శక్తి ఖర్చయినట్లు ఆమెకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంత రాత్రి అన్నికాలరీల శక్తి ఖర్చవ్వడానికి కారణం ఏంటని ఆలోచించింది.. అతని ప్రవర్తనలో మార్పును గ్రహించింది. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని గ్రహించింది. ఈ విషయాన్ని నాదియా ఎసెక్స్.. టీక్ టాక్ వీడియోతో తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకొంది. అయితే ఇప్పుడిది తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నీ తెలివికి ఫిదా’..‘నీకు మంచే జరిగింది’..‘ఎసెక్స్ రాణి ’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment