
1.Viral Video: రష్యా చమురు డిపోలో అగ్ని ప్రమాదం
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ఆయుధగారాలపై కూడా పుతిన్ సైన్యం దాడులు చేసి ధ్వంసం చేస్తోంది. ఈక్రమంలోనే ఉక్రెయిన్‌కి సరిహద్దు సమీపంలోని రష్యా చమురు డిపోలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుఝామున బ్రయాన్స్క్ నగరంలోని చమురు డిపోలో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
2.ఢిల్లీలో కుప్పకూలిన భవనం..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. సత్యనికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం సోమవారం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద అయిదుగురు భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది.
3. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి: సీఎం జగన్
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి. దీనికోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి’ అని పేర్కొన్నారు.
4.ఇక పీకేకు టీఆర్ఎస్‌కు సంబంధం ఉండదు: రేవంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై రేవంత్‌రెడ్డి మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు.
5. పుష్ప ఘటన మరువకముందే.. మరో భార్య ఘాతుకం
ఇటీవల భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ‘పుష్ఫ’ ఘటన మరవకముందే తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులైనా కాకముందే దారుణం జరిగింది. హన్మకొండ జిల్లాలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో భార్య అర్చన.. భర్త రాజు గొంతు కోసింది. అయితే, వీరికి మార్చి 25వ తేదీన వివాహం జరగడం విశేషం.
6. పంజాబ్ కింగ్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2022 సీజన్ రెండో అర్ధ భాగం మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 25) కింగ్స్ ఫైట్ జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఇంచుమించు ఇదే పరిస్థితి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 8వ స్థానం) ఉన్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
7.రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పాను
సీనియర్ హీరో, నటుడు బానుచందర్ క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో భాను చందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను పలకరిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు.
8. బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు!
దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజాలన్నీ గతేడాది నవంబర్ నెలలో 20, 25 శాతం (కంపెనీని బట్టి) టారిఫ్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు మరోసారి యూజర్లపై ధరల భారం మోపేందు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా... ఎవరతై తక్కువ ప్లాన్ టారిఫ్ ప్లాన్‌లను వినియోగించడం, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల బేస్‌ను తగ్గించాలని చూస్తున్నాయి.
9. వరుస ఓటముల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసి ప్లే ఆఫ్స్ బరి నుంచి దాదాపుగా తప్పుకున్న ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 24) లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. తదుపరి మ్యాచ్‌లకు ముంబై జట్టులో కీలక మార్పులు తప్పవని ఆయన పేర్కొన్నాడు.
10. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్.. చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
తిమ్మాపూర్‌లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్‌లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్‌లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment