
1. Viral video: చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు
చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా విజృభిస్తుంది. ఇప్పటికే లాక్‌డౌన్ వంటి పలు ఆంక్షలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది చైనా. అదీగాక వరుస లాక్‌డౌన్‌లతో విసుగుపోయిన ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. Tirupati-CM Jagan: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు..
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంగ్లిషు మీడియం చదువులు.. బాబు హయాంలో ఉన్నాయా? పేద పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తే.. ప్రశ్నిస్తారనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు
హర్యానా పోలీసులు గురువారం భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టిఫిన్ బాంబులను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా
తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి.. మేలో ఎన్ని చిత్రాలంటే..
మొన్నటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన పాన్ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్‌చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కేజీయఫ్ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్‌లో నయా జోష్ మొదలైంది.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. IPL 2022: ఢిల్లీతో తలపడనున్న ఎస్‌ఆర్‌హెచ్.. హెడ్ టూ హెడ్ రికార్డులివే..!
ఐపీఎల్-2022లో బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు గురువారం(మే5) తలపడనున్నాయి. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ఆఫీసులో అరగంట నిద్రపోవచ్చు.. ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల పనితీరు సామర్థ్యం పెంచేందుకు అనేక కంపెనీలు హైబ్రిడ్ పని విధానానికి జైకొడుతున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి వినూత్న నిర్ణయం తీసుకుంది. పని సమయంలో అరగంట పాడు నిద్రపోవచ్చంటూ ఉద్యోగులకు అవకాశం కల్పించింది.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా?
నవీన్‌కి ఒకరోజున ఉన్నట్టుండి గుండె నొప్పిగా అనిపించింది. కంగారు వేసింది. వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగు తీశాడు. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి భయపడాల్సిన పనేమీ లేదని, గ్యాస్ట్రిక్ ట్రబులేననీ చెప్పి పదిరోజులపాటు రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో పాంటాప్రజోల్ టాబ్లెట్ ఒకటి వేసుకోమని, కొంతకాలం పాటు పులుపులు, పప్పులు, మసాలాలకు దూరంగా ఉంటే అదే తగ్గిపోతుందని చెప్పారు.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటన్నాం.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా
విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు.
►పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment