Top 10 Telugu Latest News: Evening Headlines Today 3rd May 2022 - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Wed, May 4 2022 5:00 PM | Last Updated on Wed, May 4 2022 6:47 PM

Top 10 Telugu Latest News Evening Headlines Today 3rd May 2022 - Sakshi

1.  ప్రపంచానికి మరో హెచ్చరిక.. తగ్గేదేలే అంటున్న నార్త్‌ కొరియా కిమ్‌
అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వరుస క్షిపణి ప‍్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగినట్టుగానే నార్త్‌ కొరియా బుధవారం మరో బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 
👉పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. CM Jagan Review Meeting: ప్రజలకు ఇబ్బంది రాకుండా భారీగా విద్యుత్‌ కొనుగోళ్లు
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ డిమాండ్‌-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. ఎంపీ అర్వింద్‌ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత
బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన‍్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. యూపీలో దారుణం.. పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచార బాధితురాలిపై పోలీస్‌ లైంగిక దాడి
అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్‌ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ పోలీస్‌ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. IPL 2022 RCB Vs CSK: సీఎస్‌కేను ఢీ కొట్టనున్న ఆర్‌సీబీ.. టాస్‌ గెలిస్తే!
పుణేలోని ఎంసీఏ క్రికెట్‌ స్టేడియం వేదికగా బుధవారం(మే 4) చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక వరుస మూడు ఓటములతో డీలా పడ్డ ఆర్‌సీబీ.. సీఎస్‌కేపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. SV Krishna Reddy: కారుకు జరిమానా, పోలీసులపై డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
కొద్ది రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి  కార్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. ఆర్బీఐ కీలక ప్రకటన, దేశీయ స్టాక్‌ మార్కెట‍్లపై బేర్‌ పంజా!
దేశీయ స్టాక్‌ మార్కెట‍్లపై బేర్‌ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపడంతో వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్బీఐ తీసుకున్న కీలక ప్రకటనతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8..Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల
జుట్టు పొడవుగా... ఒత్తుగా పెరగడంలో క్షారం ఉన్న ఆహార పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్‌ లేదా క్షారం శరీర పీహెచ్‌ స్థాయులను సమతులంగా ఉంచి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేసి, శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఫలితంగా కురులకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9..గుడ్‌ క్యాచ్‌! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్‌! వీడియా వైరల్‌
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్‌ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్యలు: జ్యోతి కళ్ల ముందే యశ్వంత్‌ను చంపి, ఆపై..
అబ్దుల్లాపూర్‌మెట్‌ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్‌ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే.  భార్య ప్రియుడైన యశ్వంత్‌తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్‌ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement