వాషింగ్టన్ : కలలు అందరూ కంటారు.. కొంతమంది మాత్రమే ఆ కలల్ని సాధించటానికి కృషి చేస్తారు. ఎన్ని కష్టాలొచ్చినా.. నష్టాలొచ్చినా పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారినే లోకం కీర్తిస్తుంది.. వారి గురించే జనాలు గొప్పగా చెప్పుకుంటారు. అమెరికాకు చెందిన ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ కూడా కలలు కన్నారు. చదువులో అత్యధిక మార్కులు సాధించాలని కష్టపడ్డారు. ఆ కష్టం ఫలించింది.. వారిని అంతర్జాతీయ సెలెబ్రిటీలను చేసింది.
వివరాలు.. అమెరికాలోని లూసియానాకు చెందిన డెనీసా, డెస్టినీ కాడ్‌వెల్ ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్. వీరు స్కాట్‌లాండ్ విల్లే మాగ్నెట్ హై స్కూల్‌లో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చదివారు. డెస్టినీ 4.0 జీపీఏ, డెనీసా 3.95 జీపీఏ సాధించారు. స్కూల్ టాపర్స్‌గా నిలిచారు. దీంతో 24 మిలియన్ డాలర్ల స్కాలర్‌షిప్‌లు వారిని వరించాయి. అంతేకాదు 200 కాలేజీలనుంచి తమ కాలేజీలో చేరండంటూ ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ సిస్టర్స్ అంతర్జాతీయ సెలెబ్రిటీలు అయిపోయారు.
‘‘ మీరు సాధించాలనుకున్న దాన్ని పూర్తిగా సాధించండి’’..
‘‘మిమ్మల్ని కుంగదీసే నెగిటివిటీని బుర్రలోనికి రానికండి. దాన్నో మోటివేషన్‌గా తీసుకోండి. అన్నింటినీ పాజిటివ్‌గా వాడుకోండి’’
అని తమ సక్సెస్ ఫార్ములాను చెప్పుకొచ్చారు. వీరు కేవలం చదువులోనే కాదు! డ్యాన్స్, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment