ప్రతీకాత్మక చిత్రం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సెలవులపై ఇంటికి వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసాల గడువును నవంబర్ 10 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి నవంబర్ 9 లోపు గడువు ముగిసే వీసాలను పొడిగించింది. ఈ మేరకు దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్, ఫారెన్ ఎఫైర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశంతో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల వలస కార్మీకులకు ఎంతో మేలు కలుగనుంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు గతంలో సెలవులపై సొంతూళ్లకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment