
ప్రముఖ నేతలు వివిధ వేదికలపై ప్రసంగిస్తుంటే ఏకాగ్రతతో వింటుంటాం. వారు ఏకధాటిగా ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతుంటాం. అయితే.. నేతలు ప్రసంగాలకు టెలీప్రామ్టర్లు వాడుతుంటారని చాలా మందికి తెలియదు. అలా టెలీప్రామ్టర్‌లో చూస్తూ ప్రసంగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దొరికిపోయారు. పొరపాటున టెలీప్రామ్టర్ సూచనను లైవ్‌లో చదివేశారు. ఈ సంఘటన శుక్రవారం టెలివిజన్ ప్రసంగం సందర్భంగా జరిగింది.
'ఎండ్ ఆఫ్ కోట్, రిపీట్ ది లైన్' అనే సూచనను లైవ్‌లో బిగ్గరగా చదివారు బైడెన్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత టెలీప్రామ్టర్‌లో చూస్తూ చదివేందుకు బైడెన్ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించినా.. తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
Joe Biden accidentally reads the part on the teleprompter that says "repeat the line" when they wanted him to say the line again lmfao pic.twitter.com/pS3GdXPe5N
— Greg Price (@greg_price11) July 8, 2022
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లైవ్‌లో తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే పలుమార్లు తప్పుగా ఉచ్చరించి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పేరును పలకడంలో తడబాటుకు గురయ్యారు. అంతకు ముందు సమాన వేతన దినోత్సవం సందర్భంగా వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో.. అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌ను ఫస్ట్ లేడీ అంటూ పిలిచారు.
ఇదిలాఉండగా.. అబార్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్షుడు బైడెన్. అబార్షన్ హక్కును కాపాడుతూ తీసుకొచ్చిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment