Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి | Walkie Talkies And Solar Equipment Exploded Lebanon Beirut | Sakshi
Sakshi News home page

Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి

Published Thu, Sep 19 2024 7:48 AM | Last Updated on Thu, Sep 19 2024 9:54 AM

Walkie Talkies And Solar Equipment Exploded Lebanon Beirut

బీరుట్‌: లెబనాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వాకీటాకీలు, పేజర్ల పేలుళ్లతో లెబనాన్‌ దద్దరిల్లింది. ఇక, తాజాగా వాకీటాకీల పేలుళ్ల కారణంగా దాదాపు 32 మంది మృతిచెందగా.. 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బుధవారం పలుచోట్ల పేజర్లు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మృత్యువాతపడగా 2800 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. పేజర్‌లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో ఇలా మరో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. వైర్‌లెస్‌ పరికరాలైన పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఈ పరికరాల హ్యాకింగ్‌ ఎలా జరిగింది అనేది కీలకంగా మారింది. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హిజ్బుల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలూ పేలాయి.  

ఇక.. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్యల మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

 

అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్‌ అని ఉంది. ఐకామ్‌ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. కాగా, లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్‌ వెల్లడించింది. ఇక, ఇవి చేతితో పట్టుకునే విధంగా రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బోల్లా ఐదు నెలల కిందట కొనుగోలు చేసింది. ఇక, తాజాగా ఈ పరికరాలు పేలిన కారణంగా భారీ నష్టం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై భీకరంగా దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు కొత్త తరహా దాడులో లెబనాన్‌పై విరుచుకుపడుతోందని పలువురు చెబుతున్నారు. అందులో భాగంగా ఇలా అనూహ్య పేలుళ్ల ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌ తన సైనికులతో యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించిందని, మరింత ధైర్యం, అంకిత భావం అవసరమని సూచించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు లెబనాన్‌ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని ఇజ్రాయెల్‌ తరలిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్‌ ఇచ్చిన యూనియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement