
మనం హెయిర్‌కట్ చేయించుకోవాలంటే కచ్చితంగా బార్బర్ షాపుకు వెళ్లాల్సిందే. మనం చెప్పిన విధంగా హెయిర్‌కట్ చేసే బార్బర్లను చూసే ఉంటాం. అందులో కొందరు మాత్రం ట్రెండ్‌కు అనుగుణంగా ఫాలో అవుతూ డిఫరెంట్ హెయిర్‌స్టైల్స్ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆ కోవకు చెందినవాడే. తన షాపుకు వచ్చిన ఒక కస్టమర్‌కు వినూత్న రీతిలో హెయిర్‌కట్ చేశాడు.ఇది ఎలా ఉందా అని చూడ్డానికి బార్బర్ ఎన్ని కోణాల్లో చూశాడో లెక్కేలేదు. చివరకు దుకాణం నుంచి బయటకు వెళ్లి కూడా చూశాడు. అచ్చం టోపీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కస్టమర్ జట్టును అలానే తయారు చేశాడు. (చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు)
ఈ హెయిర్‌స్టైల్ చేయించుకుంటే దూరం నుంచి చూస్తున్నవారికి టోపీ పెట్టుకున్నాడా అనే సందేహం కూడా కలుగుతుంది. దాదాపు 44 సెకండ్ల నిడివి ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా ఫన్నీగా అనిపించినా.. బార్బర్ పని తనానికి మెచ్చకోకుండా ఉండలేం. ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియదుగాని సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. 'నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. భలే ఉంది టోపీ హెయిర్‌స్టైల్.. మీ టాలెంట్‌కు ఇవే మా జోహార్లు ' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
We need more barbers like this guy😂 pic.twitter.com/he4dhLMwlu
— 🇧🇧 (@rahm3sh) September 2, 2020
Comments
Please login to add a commentAdd a comment