వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలి కాలంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తుల దాడుల్లో భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వరుస దాడులపై అమెరికాలోని వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అలాగే, అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చి చెప్పింది.
వివరాల ప్రకారం.. అమెరికాలో భారత సంతతి వారిపై దాడులను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజాగా ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘జాతి, ప్రాంతం, స్త్రీపురుష బేధాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోంది. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. ఈ దాడుల కారణమైన వారికి కఠినంగా శిక్షిస్తాం అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. నిన్న(గురువారం) కూడా మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలబామాలో హోటల్ నడుపుతున్న ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచ్చిన ఓ కస్టమర్ గన్‌తో కాల్చి చంపాడు.
మరోవైపు.. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ తెలిపారు. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు.
మరణాలు ఇవే..
ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా హత్యకు గురయ్యాడు.
సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు.
శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
పర్‌డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment