వాషింగ్టన్ డీసీ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు 20ఏళ్ల థామస్ మ్యాథ్యు క్రూక్స్ ఫొటోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)అధికారికంగా విడుదల చేసింది.
గత శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లోని బట్లర్ పట్టణంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రసంగం వేదికగా ఎదురుగా ఓ బిల్డింగ్‌పై నుంచి నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్రగాయమైంది.
కాల్పుల అనంతరం క్రూక్స్ తప్పించుకునేందుకు ఒక బిల్డ్‌పై నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ట్రంప్‌ను నీడలా నిత్యం వెంట ఉండే సీక్రెట్ ఏజెంట‍్లు సెకన్ల వ్యవధిలో మట్టుబెట్టడంతో ప్రాణాపాయమే తప్పింది.
ఈ ఉదంతం తర‍్వాత నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? దాడికి గల కారణాల గురించి తెలుసుకునే పనిలో పడ్డారు ఎఫ్‌బీఐ అధికారులు.. ఇందులో భాగంగా నిందితుడి ఫొటోని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీక్రెట్ ఏజెంట్ల కాల్పులతో మరణించిన క్రూక్స్ డెడ్ బాడీ పక్కనే అసాల్ట్ రైఫిల్ ఏ-15 ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.
క్రూక్స్ చదువుకున్న బెతెల్ పార్క్ హై స్కూల్లో చురుకైన విద్యార్ధిగా పేరు సంపాదించాడు. స్కూల్‌లో నిర్వహించిన నేషనల్ మ్యాథ్స్, సైన్స్ ఇన్షియేటీవ్ కాంపిటీషన్‌లో 500 డాలర్ల ప్రైజ్‌మనీని దక్కించుకోవడం గమనార్హం.
నవంబర్ 5 న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తొలిసారి తన ఓటు వినియోగించుకునేందుకు క్రూక్స్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక స్కూల్స్ ఫ్రెండ్స్ క్రూక్స్ ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడని, రాజకీయాలు గురించి, లేదంటే ట్రంప్ గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చిన దాఖలాలు లేవని వారు స్థానిక మీడియతో మాట్లాడారు. కానీ నిందితుడు స్కూల్లో వేధింపులకు గురైనట్లు చెప్పగా.. ఎఫ్‌బీఐ అధికారులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment