కాలిఫోర్నియాలో మంటల బీభత్సం.. 1200 మంది తరలింపు | Wildfire Named Post Fire Spreads Los Angeles To California, Over 1200 People Evacuated | Sakshi
Sakshi News home page

California Wildfires: కాలిఫోర్నియాలో మంటల బీభత్సం.. 1200 మంది తరలింపు

Published Mon, Jun 17 2024 9:01 AM

wildfire Named Post Fire Spreads Los Angeles To California

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భీకర వాతావరణం నెలకొంది. కాలిఫోర్నియాలోని అడవిలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా సుమారు 1200 మంది వారి నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతలకు తరలివెళ్లారు. మంటల కారణంగా రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. దక్షిణ కాలిఫోర్నియాలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. అడవిలో విస్తరిస్తున్న మంటల కారణంగా కనీసం 1,200 మంది ప్రజలు ఖాళీ చేయవలసి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక, మంటల వ్యాప్తితో 16 చదరపు మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలు క్రమంగా ఆ ప్రాంతమంతా చుట్టుముట్టాయి. మరోవైపు.. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ బ్రిగేడ్ ప్రకారం.. ఈ అగ్నికి పోస్ట్ ఫైర్ అని పేరు పెట్టారు.

 

 

మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. కాలిఫోర్నియా నుండి న్యూ మెక్సికో వరకు కార్మికులు అడవి మంటలను నియంత్రించడానికి కష్టపడుతున్నారు. లాస్ ఏంజిల్స్‌కు వాయువ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్మాన్‌లోని ఇంటర్‌స్టేట్-5ఫ్రీవే సమీపంలో ఈ మంటలు శనివారం ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదని అధికారులు తెలిపారు. 

 

 

 

మరోవైపు.. మంటల కారణంగా హంగ్రీ వ్యాలీ ప్రాంతం నుంచి 1200 మందిని తరలించినట్టు లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. అలాగే, అగ్ని ప్రమాదం దృష్ట్యా హంగ్రీ వ్యాలీ, పిరమిడ్ సరస్సు రెండూ మూసివేయబడ్డాయి. అలాగే, మంటల వల్ల ఇళ్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయితే రెండు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement