Woman Fell In Love With Man Who Stole Her Phone - Sakshi
Sakshi News home page

ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది

Published Wed, Jul 26 2023 7:32 AM | Last Updated on Wed, Jul 26 2023 12:06 PM

woman dating man who mugged her you stole her phone - Sakshi

ఆ దొంగ తొలుత ఆమె ఫోన్ ఎత్తుకెళ్లాడు. తరువాత ఆమె హృదయాన్ని దోచుకున్నాడు. ఒక బ్రెజిలియన్ యువతి తనను దోచుకున్న దొంగతో ప్రేమలో పడ్డానని వెల్లడించిన నేపధ్యంలో దొంగతనానికి కొత్త అర్థం వచ్చినట్లయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరూ విడదీయలేని జంటగా మారిపోయారు. 

ఆన్‌లైన్‌లో షేర్‌ అయిన ఈ జంటకు సంబధించిన వీడియోకు 2,32 వేలకుపైగా వీక్షణలు దక్కాయి. ఈ  వీడియోలో ఈ జంట తమ ప్రేమ కథను వివరించారు. ‘ఆరోజు నేను.. అతను నివసించే వీధిలో నడుస్తున్నాను.  అప్పుడు నా ఫోన్‌ చోరీ జరిగింది’ అని అంటూ ఇమాన్యులా బ్రెజిల్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో తమ మొదటి కలయిక గురించి వివరించింది.

మనసు మార్చుకున్నదొంగ
ఆ రోజు దొంగ తన ఫోన్‌ను ఎలా తీసుకున్నాడో ఆమె గుర్తుచేసుకుంది. అతను ఆరోజు దోపిడీకి పాల్పడ్డాడని తెలిపింది. అయితే ఇది మరొకరి ఫోన్ నంబర్‌ను తెలుసుకునే  మార్గం అని పేర్కొంది. అప్పటి వరకూ  తనకు తెలియని జాకర్(దొంగ) మనసు మార్చుకున్నాడని ఇమాన్యులా చెప్పింది. తరువాత జాకర్‌ మాట్లాడుతూ తనకు గర్ల్‌ఫ్రెండ్‌ లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ సమస్యకు ఊహించని విధంగా పరిష్కారం దొరికింది అంటూ తమ మొదటి  కలయికను జాకర్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ ఫోనులో తాను ఆమె ఫోటోను చూసినప్పుడు, ఆమె అందానికి ఫిదా అయ్యాను. ప్రతిరోజూ ఆమెను చూడాలనుకున్నాను. ఆమె ఫోను దొంగిలించినందుకు చింతించాను అని అన్నాడు.

ఒక రిపోర్టర్ మాట్లాడుతూ  ‘మీరు తొలుత ఆమె  ఫోన్‌ను దొంగిలించారు. తరువాత ఆమె హృదయాన్ని దొంగిలించారు’ అని అన్నాడు. కాగా ప్రేమలో పడినవారిద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరి వ్యవహారంపై తల్లిదండ్రుల స్పందన ఏమిటో ఇంతవరకూ తెలియరాలేదు. వీరిద్దరి ప్రేమ కథపై ట్విట్టర్ వ్యాఖ్యానాలు లెక్కకు మించి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఇది బ్రెజిల్‌లో మాత్రమే సాధ్యం’ అని ఒకరు పేర్కొనగా ‘ప్రేమ ఏదైనా సాధించగలదు’ అని మరొకరు చమత్కరించారు. 

ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్స్ రిచర్డ్ రామిరేజ్‌, జాన్ వేన్ గేసీ వంటి నేరస్తులకు పలువురుస్త్రీలు ఆకర్షితులయ్యారు. అంటే నేరాలకు ఆకర్షణకు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. 2015లో సెక్యూరిటీల మోసం కేసులో అరెస్టయిన ఫార్మా బ్రో మార్టిన్ ష్క్రెలీతో ప్రేమలో పడిన బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ క్రిస్టీ స్మిత్ తన భర్తకు విడాకులు ఇచ్చి అతనితో ఉంటోందనే వార్తలు వినిపించాయి. 
ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement