మెట్‌పల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి సాధించడమే కష్టం. అలాంటిది ఈ యువతి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన లాస్యకు మెట్‌పల్లిలోని దుబ్బవాడకు చెందిన జెట్టి నరేందర్‌తో వివాహమైంది. చదువులో చురుకుగా ఉన్న లాస్య ఇంటర్ వరకు నిర్మల్‌లోనే పూర్తి చేశారు. నిజామాబాద్ సమీపంలోని ఓ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదివారు. 2022 జనవరిలో సింగరేణి సంస్థ నిర్వహించిన నర్సింగ్‌లో ప్రతిభ చూపారు. అందులో ఉద్యోగానికి ఎంపికై న ఆమె రామకృష్ణాపూర్‌లోని సంస్థకు చెందిన ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు.
అనంతరం అఖిల భారతీయ వైద్యవిజ్ఞాన సంస్థ నిర్వహించిన పరీక్షలోను మంచి మార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యారు. కొద్దిరోజులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నర్సింగ్ ఉద్యోగ పరీక్షలో బాసర జోన్‌లో మొదటిర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్నారు. భర్త నరేందర్, కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సాధ్యమైందని లాస్య పేర్కొన్నారు. సింగరేణి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పోస్టింగ్‌లో జాయిన్ అవుతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment