ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా
జగిత్యాలఅగ్రికల్చర్/మల్లాపూర్: ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లో నూతనంగా 11 కేవీ బ్రేకర్‌ను శనివారం ప్రారంభించారు. చాలా సబ్‌స్టేషన్లలో 11 కేవీ ఫీడర్ బ్రేకర్‌పై రెండు కంటే ఎక్కువ ఫీడర్లు ఉన్నాయని, ఏదైనా ఫీడర్‌లో అంతరాయం ఏర్పడితే విద్యుత్ ట్రిప్ అవుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లావ్యాప్తంగా రూ.4.25కోట్లతో 65 వీసీబీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 బ్రేకర్లు పూర్తయ్యాయని, మిగిలినవి వచ్చేనెల 15లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ప్రజ లకు సూచించారు. మెట్‌పలిల డీఈ గంగారాం, ఏడీఈ మనోహార్, డీఈ ఎంఆర్‌టీ రవీందర్, ఏఈ సంతోష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియా నాయక్
Comments
Please login to add a commentAdd a comment