మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
జగిత్యాలటౌన్: ఎస్సీ వర్గీకరణ పోరులో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాంమాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో అమరుల చిత్రపటాలకు ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళి అర్పించారు. మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం, భావి తరాల భవిష్యత్తు కోసం సమానత్వపు పోరులో తమ ప్రాణాలు కోల్పోయినవారి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి వెలకట్టలేనివన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జాతి అభ్యున్నతికి శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నురుగు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు బెజ్జంకి సతీశ్, మోకినపెల్లి సతీశ్, బోనగిరి కిషన్, దుమాల రాజ్‌కుమార్, బిరుదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment