నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Published Mon, Mar 3 2025 12:17 AM | Last Updated on Mon, Mar 3 2025 12:14 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించాలని సూచించారు.

మల్లన్నస్వామి దయతోనే పథకాలు

వెల్గటూర్‌: మల్లికార్జునస్వామి దయతో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన మల్లికార్జుస్వామి శివ పంచాయతన, నవగ్రహ, శ్రీకూర్మ ధ్వజ, శిఖర యంత్ర శిలావిగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం, ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ గంగుల నగేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రమేశ్‌, శివస్వాములు, యాదవ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

దేశభద్రతకు ముందుండాలి

జగిత్యాలటౌన్‌: దేశభద్రతకు సమతా సైనికులు ముందుండాలని సమతా సైనిక్‌ దళ్‌ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సమతా సైనిక్‌దళ్‌ శిక్షణతరగతుల కరపత్రాన్ని జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. జాతి, మతం, కులాలకు తావు లేకుండా సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం వారిని చైతన్య పరిచేందుకు.. రాజ్యాంగ రక్షణకు సమతా సైనిక్‌ దళ్‌ కృషి చేస్తుందన్నారు. యువత మత్తు బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందిస్తూ భావిబారత పౌరులుగా తయా రు చేయడమే లక్ష్యమన్నారు. ఈనెల 8, 9 తేదీ ల్లో కోరుట్ల పట్టణంలో నిర్వహించే శిక్షణ శిబి రంలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సైనిక్‌ దళ్‌ ప్రధాన కార్యదర్శి మెట్టు దాస్‌, మాలమహానా డు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి, డీఎస్‌ ఎస్‌ నాయకులు తక్కల దేవయ్య, మద్దెల నారాయణ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి ప్రజావాణి రద్దు1
1/1

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement