ధర్మపురి అభివృద్ధి పనులపై సీఎంకు వినతి
ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం వినతిపత్రం సమర్పించారు. శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత నీటి ఫిల్టర్ కోసం రూ.17 కోట్లు అవసరమని పేర్కొన్నారు. డిగ్రీ, ఐటీఐ కళాశాల ఏర్పాటు, రానున్న పుష్కరాలకు, పట్టణ ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నవోదయ గురుకులం ధర్మపురిలోనే ఉండేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment