● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ● జిల్లావ్యాప్తంగా 32 ఫిర్యాదులు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు భారీగా తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలు మూలల నుంచి వివిధ సమస్యలపై 32 ఫిర్యాదులు రాగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


