గ్రంథాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: గ్రంథాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, తెలంగాణ భాష సాహిత్యం పునర్నిర్మాణంలో తెలంగాణ సారస్వత కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సారస్వత ప్రధాన కార్యదర్శి చెన్నయ్య మాట్లాడుతూ నిజాంకాలం నుంచే తెలుగు భాష సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించడంలో తెలంగాణ శాశ్వత పరిషత్ అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉందన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, రాబోయే తరాలకు ఈ గ్రంథం ఉపయోగపడుతుందన్నారు. డీఈవో రాము, జిల్లా సమగ్ర స్వరూం పుస్తక కో–కమిటీ సభ్యులు శరత్‌చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి, నాగభూషణం, కళాశాల సీపీడీసీ కార్యదర్శి శ్రీలత, అధ్యాపకులు చంద్రయ్య, వరప్రసాద్, రహీం పాల్గొన్నారు.


