
కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈఓ రాము
జనగామ రూరల్: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ప్రిన్సిపాల్ కనగాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాంతీయ సమన్వయ అధికారి రజిని మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్య అందించడానికి ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. నర్సింహారా వు, రాంరాజ్, నర్సింహులు, వెంకటలక్ష్మి, నాగేశ్వర్‌రావు, కిషన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment