
మేనేజర్ శ్రవణ్‌కు మ్యాజిక్ పవర్ అందజేస్తున్న సర్పంచ్ హయతలి
రఘునాథపల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిడిగొండ ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ శ్రవన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఫతేషాపూర్‌లో నిడిగొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సర్పంచ్ ఎండీ హయతలి అధ్యక్షతన గ్రామస్తులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
బీమా పథకాలతో కుటుంబాలకు భరోసా లభిస్తోందన్నారు. రైతుబంధు మండల సభ్యుడు గాజులపాటి విరోజి, వీఓఏలు గాజులపాటి రమ, ఉమ్మగోని విమల, గ్రామ పెద్దలు హింగె మోహన్, నానాజి, లోడె నర్సయ్య, బీమయ్య, మహేందర్, కళాకారుల బృందం సభ్యులు రామాంజనేయులు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment