
బచ్చన్నపేట: మాట్లాడుతున్న బూర నర్సయ్యగౌడ్
బచ్చన్నపేట: నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని కేవలం తన అస్థిత్వాన్ని మాత్రమే కాపాడుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం కట్కూర్‌లో అసెంబ్లీ కన్వీనర్ బళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగోస–బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికేతరుడు అయిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కట్కూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శ్రవణ్‌గౌడ్, కుంట్ల రాములు ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ. 5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప, మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్, బూత్ అధ్యక్షులు కదునూరి పాండు, గుడ్ల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ సభాస్థలి పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్‌ల ముగింపు సందర్భంగా శనివారం డివిజన్ కేంద్రంలో జరిగే సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, నియోజకవర్గ పాలక్ వట్టివల్లి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్ శుక్రవారం పరిశీలించారు. నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, గట్టు కృష్ణ, శివరాజ్‌యాదవ్, రడపాక పవన్ పాల్గొన్నారు.
కేసీఆర్ చేసింది శూన్యం
నర్మెట: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని, రాష్ట్రంలో కొసాగుతున్న అరాచక కుటుంబ పాలనను అంతమొందించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు ఇప్పలగడ్డలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. పార్టీ శాఖ అధ్యక్షుడు ధరావత్ రాజు, జిల్లా కార్యదర్శి సొక్కం అనిల్ కుమార్, చిర్ర తిరుపతిరెడ్డి, పినింటి శ్రీనివాస్‌రెడ్డి, గంగం ప్రభాకర్‌రెడ్డి, పాతూరి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం
పాలకుర్తి టౌన్: బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లేగ రామ్మోన్‌రెడ్డి, దొంగరి మహేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని శాతాపురం గ్రామంలో ప్రజాగోస– బీజేపీ భోరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడూతూ గతంలో బంగారు తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తాగుబోతుల, అప్పుల తెలంగాణ చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారం రవికుమార్, పట్టణ అధ్యక్షులు దుంపల సంపత్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment