
రఘునాథపల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజయ్య
రఘునాథపల్లి: అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గబ్బెటలో ఆయన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మానవ శరీరంలో అన్నింటి కంటే ప్రధాన మైనది కంటి చూపు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హషిం, ఎంపీటీసీలు గూడెల్లి శిరీష, కేమిడి రమ్య, వైద్యులు డాక్టర్ కమలహసన్, డాక్టర్ రాధిక, సందీప్, బిక్కునాయక్, విష్ణువర్దన్‌రెడ్డి, యశోద, మమత తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల కళ్లల్లో వెలుగులు
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో పేద ప్రజల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామని సర్పంచ్ బిల్లా అంజమ్మ అన్నారు. ఎనిమిది రోజులు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతోపాటు మందులు అందించినట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని కామరెడ్డి గూడెంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిర ముగింపు సందర్భంగా వైద్య బృందం, సిబ్బందిని ఆమె ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు ఏల అనిల్ కుమార్, బొబ్బిలి, మేడబద్రి, జెస్సీకా, అంజలి, భాగ్య, వసంత, సంపూర్ణ, ఉప్పలయ్యల పాల్గొన్నారు.

దేవరుప్పులలో వైద్య సిబ్బందికి సన్మానం
Comments
Please login to add a commentAdd a comment