
ఫోన్‌లో మాట్లాడుతూ సమస్యలు నోట్ చేసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ రజిత
ప్రశ్న: కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నాం. పిల్లలను బయటకు పంపితే తోడు వెళ్లాల్సి వస్తోంది. కోతులు ఇళ్లలోకి దూరుతున్నాయి. బెదిరించినా వెంబడిస్తున్నాయి. అర్ధరాత్రి కుక్కలు అరుస్తుంటే నిద్ర పట్టడం లేదు.
● అశోక్, రైస్ మిల్లర్, గీతానగర్, కడారు ప్రవీణ్, ఎండీ.దస్తగిరి, మేకల సమ్మయ్య, చందు, రాములు, శ్రీనివాస్, రమేష్, సురేష్, కవిత, కూరపాటి శ్రీనివాస్, సంతోష్‌కుమార్, మహేష్, వెంకటరమణారెడ్డి, ఎండీ రఫిక్, సుచరిత, లక్ష్మీ– 1, 4, 7, 8, 11, 12, 14, 17, 26, 27 వార్డులు, వీర్స్‌కాలనీ, శ్రీ విల్లాస్, అంబేడ్కర్‌నగర్, వాసవీ కాలనీ, శ్రీహర్షనగర్
కమిషనర్ : 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.
ప్రశ్న: డ్రెయినేజీ నీరు ఇంటిముందే ఆగుతోంది. పందులు తిరుగుతున్నాయి. దోమలు పెరిగాయి. అవోపా బిల్డింగ్ ఏరియాలో సీసీరోడ్డు తవ్వి పూడ్చలేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. 17వ వార్డులో సీసీరోడ్లపై గుంతలు పడుతున్నాయి. 23వ వార్డులో కోతులు కరెంటు తీగలపై సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. హనుమకొండ రోడ్డు దేవీథియేటర్ ఆవరణ అపార్టు మెంటులో అద్దెకు ఉంటున్న వారు రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు.
● పవన్‌కుమార్, క్రాంతి, అబ్బాస్, రేకల చంద్రమోహన్ గౌడ్, జాయ మంజుల, కనకరాజు, సయ్యద్ యాకూబ్, ఎ.నర్సింహులు, కృష్ణమూర్తి, స్వరూప, సయ్యద్ జాహంగీర్– 5, 13, 17, 19, 21, 23 వార్డులు బీరప్ప టెంపుల్, ఇందిరమ్మకాలనీ, ప్రగతినగర్, కుర్మవాడ, శ్రీహర్షనగ్ కాలనీ
కమిషనర్ :అన్ని సమస్యలను పరిశీలిస్తాం
జనగామ: పట్టణ ప్రజలు చెప్పే ప్రతి సమస్యను ఓపికగా వింటూ.. సమాధానం చెబుతూ.. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కాలనీ ల్లో నెలకొన్న ఇబ్బందులను తెలుసుకు నే ప్రయత్నం చేశారు మున్సిపల్ కమిషనర్ రజిత. కుక్కలు, కోతుల బెడద, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఉదయం 10.40 నుంచి 12.10 గంటల వరకు జరిగిన ఫోన్‌ఇన్‌లో కమిషనర్ 50 మందితో మాట్లాడగా.. మరో 265 కాల్స్ వచ్చాయి. కుక్కలు, కోతుల బెడద నియంత్రణకు చంపక్ హిల్స్ డంపింగ్ యార్డు వద్ద జంతు జనన నియంత్రణ సెంటర్ ప్రారంభిస్తున్నామని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని కమిషనర్ చెప్పారు. అలాగే డ్రెయినేజీల నిర్వహణ, వీధిదీపాలు, తాగునీటి శుద్ధీకరణ, పారిశుద్ధ్య కార్మి కుల పని తీరు, కుళాయి కనెక్షన్లకు తవ్విన సీసీరోడ్డు మరమ్మతులు, శ్మశాన వాటికలు తదితరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలించి ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు.
లకావత్ లాల్‌మా, 2వ వార్డు : రూ.లక్ష చెల్లించి ఇంటి అనుమతులు తీసుకున్నాం. డ్రెయినేజీ లేదు. ఇంటి ముందు మురికి నీరు ఆగితే పంచాయితీ అవుతోంది.
కమిషనర్ : ఇంజనీరింగ్ అధికారులను పంపిస్తాం
రవీందర్, 7వ వార్డు : డిగ్రీ కళాశాల ఏరియాలో 30 కుటుంబాలకు నల్లా కనెక్షన్ లేదు. వాటర్ పైపులైన్ వేయలేదు. కనెక్షన్‌కు అనుమతి తీసుకున్నా పట్టించుకోవడం లేదు.
కమిషనర్ : తాగునీరు వచ్చేలా చేస్తాం
రాజేష్, 6వ వార్డు, ఎండీ.సయ్యద్, హెడ్‌పోస్టాఫీసు ఏరియా : పోస్టాఫీసు ఆవరణలో దుమ్ము భరించ లేకపోతున్నాం. కొత్తగా నిర్మాణం చేస్తున్న రేడియాలజీ హబ్ భవనంతో డ్రెయినేజీలో చెత్త పేనుకుపోయి మురికి నీరు ఆగి కంపుకొడుతోంది.
లక్ష్మణ్, వ్యాపారి : ఆర్టీసీ చౌరస్తా హనుమకొండ రోడ్డువైపు డ్రెయిన్‌లు నిండి దుర్వాసన వస్తున్నది.
కేమిడి చంద్రశేఖర్, 15వ వార్డు అడ్వకేట్ : మురికి కాల్వలను రెగ్యులర్‌గా క్లీన్ చేయడంలేదు. ఒకేచోట మురికినీరు ఆగిపోతున్నది.
కమిషనర్ : శుభ్రం చేయిస్తాం.
సిరీష, బీరప్పగుడి ఏరియా : పాత ఇనుప సామాను వ్యాపారం చేసే వారు అన్నీ రోడ్డుపైనే వేస్తుండడంతో పందులు, కుక్కలు ఇక్కడే ఉంటున్నాయి. పిల్ల్లలను ట్యూషన్‌కు తీసుకువెళ్లే సమయంలో మీదకు వస్తున్నాయి.
కమిషనర్ : భయపడకండి, సమస్య పరిష్కరిస్తాం
మహ్మమద్ ఆసిఫ్, గిర్నిగడ్డ: ఆర్నెళ్ల నుంచి మోరీలు క్లీన్ చేయడం లేదు. నల్లా కనెక్షన్ కోసం సీసీరోడ్డు తవ్వి ట్యాప్ బిగించకుండా పోయారు. ఇంటి ఎదురుగా కుక్కలు పెంచుకుంటున్నారు. చిన్నారులను బెదిరిస్తున్నాయి.
కమిషనర్ :సమస్యలకు పరిష్కారం చూపిస్తాం
శ్రీధర్, 14వ వార్డు: హైమాస్ట్ లైట్ వెలుతురు రావడం లేదు. కాలనీలో రాత్రి చీకటిగా ఉంటోంది. ఆర్డీఓ కార్యాలయం వరకు పైపులైన్ కోసం తవ్వడంతో గర్భిణులు ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఇబ్బందిగా ఉంది.
అంకం రవీందర్, జనగామ : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హైమాస్ట్ లేక ఇబ్బందిగా ఉంది.
కమిషనర్ :విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం.
కొత్తపల్లి అభినాష్, 5వ వార్డు: కాలనీలో డ్రెయినేజీ లేదు. ఇందిరమ్మ ఇళ్లు సగం వరకు నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది.
కమిషనర్ : ఇళ్ల విషయం రెవెన్యూ అధికారులకు చెబుతాం. కొత్త డ్రెయినేజీ కౌన్సిల్‌కు సూచిస్తాం.
అంకిత, ఆస్పత్రి నిర్వాహకురాలు : హైదరాబాద్ రోడ్డు హౌసింగ్‌బోర్డు కాలనీ ఏరియా వేద ఆయుర్వే ద ఆస్పత్రి దారిలో వీధిదీపాలు, నూతన డ్రెయినే జీ, మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పించాలి.
కమిషనర్ : స్ట్రీట్ లైట్లు వేసేందుకు పరిశీలిస్తాం. పట్టణానికి దూరంగా ఉంది కాబట్టి కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు మురికి నీరు ఇంకడానికి గుంతలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇల్లెందుల ప్రవీణ్, 9వ వార్డు: గిర్నిగడ్డ ప్రాంతంలోని మాంసం విక్రయదారులు వేస్టేజీని శ్మశాన వాటిక ప్రాంతంలో వేస్తున్నారు. అందులో 40 కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి.
కమిషనర్ :నియంత్రణ చర్యలు తీసుకుంటాం.
సత్యవర్ధన్‌రెడ్డి, 4వ వార్డు : ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనాలను రోడ్డుపైనే పెట్టాల్సి వస్తున్న ది. దీంతో జరిమానా వేస్తున్నారు.
కమిషనర్ : ఫుట్‌పాత్ వ్యాపారంపై తనిఖీలు చేస్తాం
నాయిని సంతోష్,
5వ వార్డు, బాణాపురం : 15ఏళ్ల నుంచి శ్మశాన వాటిక లేదు. రంగప్ప చెరువు మత్తడి వద్ద అంతిమ సంస్కారం చేసేది. ఇప్పుడు వద్దంటున్నారు. నెహ్రూపార్కు వైకుంఠ ధామానికి తీసుకువెళ్తున్నాం. బాణాపురంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి.
కమిషనర్ : సమయం పడుతుంది. తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం
సురేందర్‌రెడ్డి, 25వ వార్డు : నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్డుపై దిష్టితీసిన నిమ్మకా యలు, గుమ్మడి కాయలు, మిర్చి, పసుపు, కుంకు మ వేస్తున్నారు. ఇబ్బందిగా ఉంది.
కమిషనర్ : ప్రత్యేక డ్రైవ్ చేపడతాం
కాసుల శ్రీనివాస్, శ్రీనగర్‌కాలనీ 22వ వార్డు : డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దోమల నివారణ చర్యలు లేవు. చెత్త సేకరణకు మూడు రోజులకోసారి వస్తున్నారు. కుళాయిలకోసం తీసిన గుంతలు పూడ్చలేదు.
కమిషనర్ :సమస్య పరిష్కరించేలా చూస్తాం.
జహానా, అంబేడ్కర్‌నగర్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మా ఇళ్లు ఉంది. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతోంది. డ్రెయినేజీ చిన్నగా ఉండడంతో నీరు బయటకు వస్తున్నది.
కమిషనర్ : పరిశీలిస్తాం
శ్రీనివాస్, 4వ వార్డు, జ్యోతినగర్, సరిత, 3వ వార్డు : తాగునీరు పచ్చగా వస్తోంది. అదికూడా అరగంటకు ఒక బిందె నిండే పరిస్థితి లేదు. కోటిరత్నం ఆస్పత్రి వెనక పందుల సంచారం పెరిగింది. యజమానిని నిలదీసినా పట్టించుకోవడం లేదు.
కమిషనర్ :తగిన చర్యలు తీసుకుంటాం
మిద్దెపాక స్టాలిన్, 13వ వార్డు అంబేడ్కర్ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ : నెహ్రూపార్కు ఏరియాలో ఫుట్‌పాత్ వ్యాపారం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోతుల బెడద నివారణకు తీసుకు వచ్చిన రెండు కొండెంగలు కనిపించడంలేదు.
కమిషనర్ : ఫుట్‌పాత్ వ్యాపారంపై దృష్టి పెట్టాం
బిర్రు రామలింగం, 12వ వార్డు : వీవర్స్‌కాలనీలోని అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలి.
కమిషనర్ : కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తాం.
‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో మున్సిపల్ కమిషనర్ రజిత
కుక్కల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం
కోతుల నివారణకు చర్యలు
డ్రెయినేజీ, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక ఫోకస్
ప్రజలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నాం

Comments
Please login to add a commentAdd a comment