
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
జనగామ రూరల్: డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వరం వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి వైద్యాధి కారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసీహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో వైద్యలు అందుబాటులో ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడంతో పాటు ఆధునిక వైద్య సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటికే వైద్యరంగంలో మెరుగైన సేవలందిస్తున్న జనగామ జిల్లా.. వివిధ పారామీటర్లలో ముందువరుసన ఉందని, డయాగ్నోస్టిక్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేటుకు వెళ్లకుండా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో డెలివరీల వివరాలు నమోదు చేయాలని, గర్భవతులకు ఐసీడీఎస్ ద్వారా ఇచ్చే న్యూట్రిషన్ కిట్టును అందరికీ అందించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ సుఽధీర్‌కుమార్, అశోక్‌కుమార్, రవీందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రుణాలు వెంటనే మంజూరు చేయాలి
జనగామ రూరల్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శనివారం తన చాంబర్‌లో నిర్వహించిన టీఎస్ ఐ–పాస్ సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో 12 యూనిట్లకు 21 దరఖాస్తులు రాగా 19 ఆమోదం పొందాయని, ఒకటి తిరస్కరించగా.. మరొకటి పురోగతిలో ఉందని పేర్కొన్నారు. సుమారు రూ.20 కోట్లతో 105 మంది లబ్ధిదారుల కు ఉపాధి అవకాశాలు అందుతాయని చెప్పారు. టి ప్రైడ్ పథకం ద్వారా ఎస్సీలకు 5, ఎస్టీలకు 18 వాహనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 75 యూనిట్లకు 29 ఆమోదం పొందాయని, మిగతావి మార్చిలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జనర ల్ మేనేజర్ రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాదవ్, ఆర్టీ శ్రీనివాస్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
Comments
Please login to add a commentAdd a comment