
చిల్పూరులో వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన గుట్ట
చిల్పూరు: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరు శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పాల్గుణ శుద్ధ సప్తమి ఆదివారం(నేడు) నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 5వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ వెంకట్రావు, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ప్రధాన అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తొళక్కంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. మార్చి 2న ఎదుర్కోళ్లు, 3న స్వామివారి కల్యాణం, 4న రథోత్సవం, 5న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. చిల్పూరు ఆలయం వరంగల్–హైదరాబా ద్ జాతీయ రహదారి చిన్నపెండ్యాల బస్‌స్టేజీ వద్ద ఆర్చిగేట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నేటి నుంచి వేంకటేశ్వరస్వామి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

మూలవిరాట్టు
Comments
Please login to add a commentAdd a comment