విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావొద్దు.. ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. నియోజకవర్గ పరిధి కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలు ర పాఠశాల, కళాశాలలో బుధవారం రాత్రి బస చేసిన ఆయన.. గురువారం ఉదయం పాఠశాల పరిసరాలను సందర్శించారు. వాటర్‌ప్లాంట్, వంట శాల, కిచెన్ గార్డెన్, మెనూ బోర్డును, విద్యార్థుల కోసం తయారు చేసిన అల్పహారాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు. ‘ఆహారం సరిపోతున్నదా.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. మాంసాహారం ఏ రోజుల్లో పెడుతున్నారు’ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఉపాధ్యాయుల సూచనల మేరకు చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్ రవికుమార్, ఏటీపీ ఆర్.శ్రీనివాస్, డీడబ్ల్యూ జవహర్‌లాల్, ఫ్యాకల్టీ స్లీవరాజు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment