పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఎంసీ హెచ్, మెడికల్ కళాశాల హాస్టల్ కాంట్రాక్ట్ వర్కర్ల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షు డు ఎం.రామ్‌దయాకర్, ఏనుగుల రఘు, జి.అజయ్, బి.సువర్ణ, సీహెచ్ రజిత, జి.బాలమణి, వి.మంజుల, బి.స్వరూప, యాదలక్ష్మి, జె.పద్మ తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలరాజు గౌడ్
జనగామ: బ్లాక్ కాంగ్రెస్ జనగామ జోన్ అధ్యక్షుడిగా యశ్వంతపూర్ గ్రామానికి చెందిన మెరుగు బాలరాజ్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నియామకపత్రాన్ని గురువారం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాల ని, కష్టపడిన వారికి పదవులు లభిస్తాయని కొమ్మూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సామాజిక చైతన్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి
జనగామ రూరల్: కవులు, కళాకారులు సామాజిక చైతన్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. జనగామకు చెందిన కల్చరల్ క్రియేటివ్ చానల్ కార్యక్రమాల పోస్టర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. చానల్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.కృష్ణ మాట్లాడు తూ.. విభిన్నమైన సామాజికాంశాలతోపాటు సమాజానికి పెను సవాల్‌గా మారిన డ్రగ్స్, వాటి వల్ల జరుగుతున్న దుష్పరిణామాలపై లఘుచిత్రం రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిలా సోమనరసింహాచారి, పెట్లోజు సోమేశ్వరాచా రి, లగిశెట్టి ప్రభాకర్, చిలుమోజు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం, పరిశ్రమలకు
నాణ్యమైన విద్యుత్
బచ్చన్నపేట : వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. గురువా రం మండల కేంద్రంతో పాటు, బండనాగారం, ఆలింపూర్, నారాయణపురం గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేసవిలో వ్యవసాయ బావులకు లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు హెచ్‌పీ పెంచిన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను బిగించామని చెప్పారు. రైతులు స్టాటర్‌లకు కెపాసిటర్‌లను బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నా రు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రాజ్‌కుమార్, లైన్‌మెన్‌లు శ్రీనివాస్‌రెడ్డి, మెతుకు జలేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ర్యాలీ, సదస్సు
జనగామ: సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శుక్రవారం(నేడు) నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని బంజారా నాయకు డు డాక్టర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 9 గంటలకు నెహ్రూపార్కు నుంచి ఎన్‌ఎంఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సదస్సు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. సేవాలాల్ కమిటీ తరఫున అన్నదానం ఏర్పా టు చేసినట్లు వివరించారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
Comments
Please login to add a commentAdd a comment